• satyoday 11w

    జెండాలు

    వయసు మళ్ళిన ,
    నేల రాలిన ఆకులు కొన్ని
    మొరపెట్టుకుంటున్నాయి

    ఎదిగిన చెట్టు తమని దూరం నెట్టిందని

    వేడి తగ్గిన
    రంగు వెలసిన జెండాలు కొన్ని
    కన్నీరు పెట్టుకుంటున్నాయి

    సముద్రం తమని దూరం నెట్టిందని

    నిరంతరం చిగురిస్తేనే కదా...
    వనం వికసొంచేది
    నిరంతరం ప్రవహిస్తేనే కదా...
    తీరం చేరేది

    కొందరికి విప్లవం
    ఒక నాస్టాల్జియా...
    ©satyoday