• kalakruthi 16w

    దరహాసం

    కళ్లముందు కనిపించని నీ రూపం నిజమైతే
    కలల్లో కనిపించే నీ అందం నిజమేలే,
    మెలుకువలో నీ పయన నా ధ్యాసే నిజమైతే
    నిద్దురలో నే చేసే నీ ధ్యానం నిజమేలే,
    పలవరమున నే పలికే నీ పేరే నిజమైతే
    ఊహల్లో నే జపించే ఆ నామం నీదేలే,
    నా మదిలో విరజాజులు విచ్చుకునుట నిజమైతే
    నీ గదిలో నీ పెదవుల దరహాసం నిజమేలే...!!!
    ©kalakruthi