• omsai583 5w

    నా దేశం మీద నాకు నమ్మకం పోయి రాస్తున్న మాటలు ఇవి.
    ఎటు వెళ్తున్నామో ఏమి చేస్తున్నామో అర్థం కావడం లేదు.ఒక పక్క దేశం కోసం ప్రాణాలు విడుస్తున్న సైన్యాన్ని చూసి గర్వపడాల లేక మరోపక్క రాబందులు వలె ప్రాణాల్ని పిక్కుతింటున్న మనుషుల్ని చూసి ఎడవల అని అర్థం కావడం లేదు.ఒక అమ్మాయి దారుణం గా చిత్రహింసలు గురి అవ్వి చనిపోయింది దాని కన్నా శత్రువుల చేతిలో ఒక దెబ్బతో చవడమే మంచిది అనిపిస్తుంది.దేశ సరిహద్దుల భద్రత ఆలోచిస్తున్నారు కానీ దేశం లో భద్రత ఎవరకి పట్టడం లేదు.దేవుడి గుడిలో నే తప్పు జరిగితే ఎవరని పూజించాలి.న్యాయం చేయమని వెడుకుంటే ఒక తండ్రీ.తప్పులు జరగవ అని తప్పు ని సమర్దించిన మంత్రి క మనం ఓట్లు వేసి సింహాసనం మీద కూర్చోపెట్టింది.కులాల మతాల పేర్లతో రాజకీయలు చేసే వాళ్ళని శాసన సభ లో కూర్చోపెట్టంగా మనది కూడా తప్పు ఉంది అసిఫా చావు లో.వాళ్ళ శిక్ష కోసం పోరాడుతున్నాం సరే మనకు ఎవరు వేస్తారు శిక్ష.ఇలా జరగదు మళ్ళీ అనే నమ్మకం ఏంటి.ఈ కుల మత రాజకీయాలు ని ఇలాగే ఉదిలేస్తే రెపన్న రోజున మీ అక్క చెల్లలు మీద కి రారు అన్న నమ్మకం లేదు.ఒక సమస్య పోవాలంటే దాని వేర్లు నుండి నరుకుని రావాలి.ఏ ధైర్యం ఉంటే వాళ్ళు ఇంతటి తప్పు కి సిద్ధపడతారు ఎంత రాజకీయ బలం ఉంటే ఇంత పని చేస్తారు.వాళ్ళకి అధికారం ఇచ్చి తప్పు చేయించింది మనమే ఈ తప్పు ని సరిచేసు కోవలంటే బయటకు వచ్చి నిలదీయడం నేర్చుకోవాలి.మనలో బలం లేనప్పుడు తప్పు ని నిలదియాలేనప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.కులం పేరు తో అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి.నాలుగు గోడల నుండి బయటకు వచ్చి తప్పు చేసే ప్రతి వ్యవస్థని సరి చేద్దాం.ఇది ఒకరితోనో ఇద్దరితో అయ్యా పని కాదు.మన కలయిక ఈ కుల మత రాజకీయాలు దూరం చేస్తుంది.పాడు పట్టిన వ్యవస్థను సరి చేస్తుంది...ఇప్పుడుకైనా అందరం ఒక్కటి అవ్వుదాం.నా ఈ మాటలు మీకు ఆలోచన కలిగిస్తాది అని కోరుకుంటున్నాను.
    ©omsai583