#telugu

1816 posts
  • kalakruthi 17h

    #పొరపాటు #telugu #teluguvelugu #mirakee
    ఓర చూపుల వయ్యారి చిలిపి నవ్వుల చిన్నారి!
    అలుపెరుగని ప్రయాణంలో ఆగి చోద్యం చూడమాకే!!
    నీ చూపు వెనకే వేచి చూసే దిగులు ఏమిటో చెప్పవే!
    నీ పెదవి విరుపున దాగి వున్న గుబులు గుట్టే విప్పవే!!
    అందమైన మనసు మూలన మలినమేదో మాటువేసే!
    కలికి కులుకుల తీపి పలుకుల వ్యాఘ్రమై వేటచేసే!!
    విరి కురులు ముసిరి మరులు విసిరి తెలుపు నలుపై చీకటై!
    సిరి ఒంటి వెలుగులు కంటి మెరుపులు కాంతులై సురకాంతలై!!
    చెవి రెమ్మలంచున, ముకు కాడ చివరన మొలచి మురిసిన తడి వజ్రమై!
    కనుబొమల ముంగిట, అధరాల సందిట జీర్ణమైన వర్ణమై!!
    కుతుక క్రిందుగ మది మందిరానికి దారి చూపే చక్కనైన పుట్టుమచ్చై!
    నెచ్చెలి! నెల్లప్పుడు నిన్నంటిపెట్టుకు నేనుండగ...ఎదమాటు పొంగే దుఃఖమేల, పొరపాటు నీదని చింతయేల!!!©kalakruthi

    Read More

    పొరపాటు

    నెచ్చెలి! నెల్లప్పుడు నిన్నంటిపెట్టుకు నేనుండగ... ఎదమాటు పొంగే దుఃఖమేల, పొరపాటు నీదని చింతయేల!!!©kalakruthi

  • kalakruthi 2d

    #పాషాణమ #teluguvelugu #telugu #mirakee
    హాసమా,దరహాసమా, అది నీ పరిహాసమ!
    కఠినమా, జఠిలమా, మనసే పాషాణమ!!
    కదల్లేని మెదల్లేని మొదలు నరికిని మానువ!
    కనలేని వినలేని సగం చచ్చిన మనిషివ!!
    స్పృహలో వుండే నువ్విటు నడిచావ!
    స్మృతి రాహిత్యంతో నడకే మరిచావ!!
    ప్రేమను పంచిన చేతులతో జీవ నాడినే తుంచావ!
    జీవం పోసిన ఆత్మీయతనే కత్తికో కండగ నరికావ!!
    అభిమానపు శవాల గుట్టలపై హార్మ్యాలే కట్టావ!
    అత్యాశలు ప్రకోపించి అనుబంధాల శిఖరాలే కూల్చావ!!
    హాసమా,దరహాసమా, అది నీ పరిహాసమ!
    కఠినమా, జఠిలమా, మనసే పాషాణమ!!
    ©kalakruthi

    Read More

    పాషాణమ

  • sampathyogendra 2d

    Nuvu leka
    Na kalalu mugisina
    Na kallu terichena
    Ne mayaa nannu  veedadhanta
    Na kalalu  veregena
    Na manasu ragelena
    Na prema nennu vedadhanta

    Na kallu vethekay
    na kalala rani
    Eka nuvu leka
    Nennu vethukuthu
    Nenna nadechena
    Nedu gadechena
    Repu maradhuanta

    Ne mata marena
    Nannu vadhele vellena
    Na Gunday rasay 
    Na kavithalo
    Na rani maradhuanata
    ©sampathyogendra

  • saideepbugatha 1w

    సోదరా

    ఏ దారి లేదురా సోదరా
    నాకు ఎడారే ఎదురైంది రా !
    కన్నీళ్లు మండి ఆవిరిలా ఎగసే రా
    కానీ గుండెలో బాధ తిరలేదు రా!
    ఆరాటంతో ఉరకలు పెట్టాను రా
    కానీ అలసట నన్ను కట్టేసింది రా!
    మోపిన అడుగులో ముల్లెనో గుచ్చే రా
    దాని తీసి పెట్టె చెల్లెలు ఏడ కనపడలేదు రా!
    కటిక చీకటి కారు మబ్బులా కమ్ముకొచ్చే రా
    కానీ అమ్మ చెప్పిన చందమామ కనపడలేదు రా!
    చుక్కలన్నీ దారి చూపుతాయి అన్నావు రా
    లెక్కలేని చుక్కలేన్నో నమ్మమాన్నాయి రా!
    కోసమేరుపు ఆశ గుండెను కోరుకుతోంది రా
    కడసారిగా ఓపికను కూడబెట్టమంది రా!
    కసితీరా ఒ సారి కదలి పోతానురా
    ఎడారి కూడా ఓ దారి చూపునేమో రా!
    ©saideepbugatha

  • kalakruthi 2w

    #'ప్రకృతి'
    ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'మేఘాలు వర్షించి భూదేవికి తలస్నానాలు చేయిస్తాయి'!
    ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'రుతుపవనాలు ముందుకురికి వనకన్యక అలసట తీరుస్తాయి'!
    ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'హిమశిఖరాలు తలలువూపి మంచు పుష్పాలతో గిరిపుత్రిని పూజిస్తాయి'!
    ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'సాగర కెరటాలు ఉవ్వెత్తున పైకెగసి సంయమనంతో సుకుమారి పాదాలు ముద్దాడతాయి'!
    'ప్రకృతి' పులకరించి 'పరవసించే' క్షణం పురుషుని బిగికౌగిట జేరి ఒదిగిపోయి కలిసిపోయి కరిగిపోతుంది...!!!
    ©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    'ప్రకృతి'

  • kalakruthi 3w

    #గమ్మత్తుగ
    తిక్కదనాల చక్కని చుక్క కోపం వీడవే,
    అలగటమెరుగని మల్లెమొగ్గ తాపం చూడవే!
    నీ వాదులాటలో వర్ణం మారును కీచులాటలో కసి బయలిడును,
    భావం తెలియని భావోద్వేగం బర బర పరుగిడి వురకలేయును!
    కినుకుమాని నా మనసు చూడవే,
    పట్టువీడి నీ ఒడిలో చేర్చవే!
    తప్పులెంచుటే పరిపాటైతే బిక్కచచ్చి నే బిగుసుకుపోనా,
    కలవరమెరుగని ఉక్కుమనిషినే నీ సెగ తగిలితే కరిగేపోనా!
    పంతాలు పట్టింపులు మనకు కొత్త కాదులే,
    హద్దులు లేని మన ప్రేమకి అవి అడ్డు రావులే!
    నిద్ర లేచుకుని ఒళ్ళు విరుచుకుని మత్తువీడి గమ్మత్తుగ చూడవే నా వైపు,
    రెప్పైనా ఆర్పక చూస్తూనే వున్నా నీ వైపు, నే చూస్తూనే వున్నా నీ వైపు...!!! ©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    గమ్మత్తుగ

    తిక్కదనాల చక్కని చుక్క కోపం వీడవే,
    అలగటమెరుగని మల్లెమొగ్గ తాపం చూడవే!
    నీ వాదులాటలో వర్ణం మారును కీచులాటలో కసి బయలిడును,
    భావం తెలియని భావోద్వేగం బర బర పరుగిడి వురకలేయును!
    కినుకుమాని నా మనసు చూడవే,
    పట్టువీడి నీ ఒడిలో చేర్చవే!
    తప్పులెంచుటే పరిపాటైతే బిక్కచచ్చి నే బిగుసుకుపోనా,
    కలవరమెరుగని ఉక్కుమనిషినే నీ సెగ తగిలితే కరిగేపోనా!
    పంతాలు పట్టింపులు మనకు కొత్త కాదులే,
    హద్దులు లేని మన ప్రేమకి అవి అడ్డు రావులే!
    నిద్ర లేచుకుని ఒళ్ళు విరుచుకుని మత్తువీడి గమ్మత్తుగ చూడవే నా వైపు,
    రెప్పైనా ఆర్పక చూస్తూనే వున్నా నీ వైపు...!!!
    ©kalakruthi

  • sampathyogendra 3w

    Na prema

    Patinchuko pothay prema ledhu ani
    Mataladukupothay prema putadhani
    Ignore cheysthay marichipothanu anukoku
    Nedhi kastamga penchukuna kopam iythay
    Nadhi estam ga penchukuna prema.
    ©sampathyogendra

  • kalakruthi 3w

    #బింకంగ
    మాటల్లో చెప్పలేని బాధేదో నన్ను మింగేస్తోందే నమిలి మింగేస్తోంది!
    వెతికినా కనిపించని నొప్పేదో భాదిస్తోందే నన్ను చీల్చి పారేస్తోంది!
    జవాబు లేని ప్రశ్నేదో గోంతు ఒత్తేస్తోందే పిల్లా పీక పిసికేస్తోంది...!!
    కళ్ళు మూసుకుని వున్నా మనసు నిద్రపోనంది
    మూసి వున్న కళ్ళ నుంచి ఉబికిరాక ఆగనంది!
    బింకంగా ఆత్రంగా అహం బాధని మింగేసింది
    ఎంత దాచినా దాగక బయటకు కక్కేసింది!
    ప్రశ్నించే ప్రేమని చూసి మొహం దాచేసింది
    తప్పు తెలుసుకున్నా ఒప్పక తలదించుకు నిలిచింది...!!!
    ©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    బింకంగ

    మాటల్లో చెప్పలేని బాధేదో నన్ను మింగేస్తోందే నమిలి మింగేస్తోంది!
    వెతికినా కనిపించని నొప్పేదో భాదిస్తోందే నన్ను చీల్చి పారేస్తోంది!
    జవాబు లేని ప్రశ్నేదో గోంతు ఒత్తేస్తోందే పిల్లా పీక పిసికేస్తోంది...!!
    కళ్ళు మూసుకుని వున్నా మనసు నిద్రపోనంది
    మూసి వున్న కళ్ళ నుంచి ఉబికిరాక ఆగనంది!
    బింకంగా ఆత్రంగా అహం బాధని మింగేసింది
    ఎంత దాచినా దాగక బయటకు కక్కేసింది!
    ప్రశ్నించే ప్రేమని చూసి మొహం దాచేసింది
    తప్పు తెలుసుకున్నా ఒప్పక తలదించుకు నిలిచింది...!!! ©kalakruthi

  • artha_ram 3w

    మన్నించు మగువా!

    కూర్చని మాటలు జారెను కూర్పుగా...
    గతి తప్పి నీ గుండె గాయాన్ని చేరితే...
    మన్నించు మగువా... మౌనన నిలవక...
    మన్నించు మగువా... కోపాగ్ని రాల్చక...
    నీ రౌద్రాన్ని చూసి భీతిల్లిన కనులని జూసి...
    మాటల దాటికి తాలని నా మనసుని జూసి...
    మన్నించు మగునా... ఈ మౌనశీలిని...
    మన్నించు మగువా... ఈ ఏకశీలిని...
    ©artha_ram

  • kalakruthi 3w

    #పదనిస
    తొలకరి జల్లుల చిరు చలిలో
    దుప్పటి ముసుగుల గుసగుసలు!
    కదిలే చేతుల పదనిసలో
    కిల కిల నవ్వుల సరిగమలు!
    వీచే గాలుల గిలి గిలిలో
    రాపిడి మంటల ఉష్ణములు!
    కుదురుగ ఎగసే శ్వాసలలో
    నవ్వుతు అదిరే అధరములు!
    ప్రియముగ చూసే చూపులలో
    తొణికిసలాడే ఇరు భావములు...!!
    ©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    పదనిస

    తొలకరి జల్లుల చిరు చలిలో
    దుప్పటి ముసుగుల గుసగుసలు!
    కదిలే చేతుల పదనిసలో
    కిల కిల నవ్వుల సరిగమలు!
    వీచే గాలుల గిలి గిలిలో
    రాపిడి మంటల ఉష్ణములు!
    కుదురుగ ఎగసే శ్వాసలలో
    నవ్వుతు అదిరే అధరములు!
    ప్రియముగ చూసే చూపులలో
    తొణికిసలాడే ఇరు భావములు...!!
    ©kalakruthi

  • artha_ram 3w

    మౌన దీపిక

    ప్రజ్వలించు ఉదయాన...
    ప్రతిధ్వనించు సమయాన...
    నిలిచితి నే చీకటి జాడలా...
    నిలచితి నే నిరాయుధ యోధిడిలా...
    అంచెలంచలమైన జ్ఞాన సంద్రనా...
    అవిశ్రాంతమైన ఆత్మ సంఘర్షణనా...
    నిలిచితి నే మూర్ఖపు బిందువులా...
    నిలిచితి నే మౌన దీపికలా...
    ©artha_ram

  • anonymwriter 5w

    .

  • kalakruthi 5w

    #విచిత్రమే #telugu #teluguvelugu #mirakee
    నవమాసాలు నిఘూఢ ఘాడ ద్రవ నిసిలో స్తబ్ధుగ మసలి,
    నిత్య నూతన నవ్యతల కినుకున మెల మెల్లగ రూపు దాల్చి,
    నువ్వు గింజే... శత సహస్ర చీలికలై రూప రూపాంతరముల జలపుష్పమై, భేకమై, సరీసృపమై, విహంగమై, వానరమై తుదకు నవజాత శిశువై బయల్పడి,
    క్షుత్పిపాసన రోదించి, తల్లి యదపై పారాడి చనుబాలు గుడిచి,
    గమ్మున మంద స్మితమున ఒడిలో సేద తీరు తీరే....!
    బహు చిత్రమే, భళారే ఈ సృష్టి విచిత్రమే !!!
    ©kalakruthi

    Read More

    విచిత్రమే

  • siradhaaram 5w

    నాతో

    నవ్వు దాచిన కన్నీళ్లు
    అందం దాచిన గాయాలు
    నటన దాచిన సత్యాలు
    మౌనం దాచిన ఆలోచనలు
    నిట్టూర్పు దాచిన కోపాలు
    నిద్ర దాచిన అలసటలు
    తేన్పు దాచిన ఆకలికేకలు
    భయం దాచిన ప్రేమలు
    సమయం దాచిన పాఠాలు

    ఎవరికీ తెలుసు
    నాకు, నాలోని నాకే తెలుసు

    నేను...నాతో!!!

    ©siradhaaram

  • anonymwriter 5w

    .

  • meolaf 6w

    .

    సప్త వర్ణల సంఘర్షణ లో వెలిగినా నా ఇంద్రధన్సు నువే నా
    ©meolaf

  • preranabeebireddy 6w

    Ju-Ju

    Na Peru Raju
    Thinnanu Kaaju
    Ma Chelli Vesukundhi Gaaju
    Ooru Vellam Oka Roju
    Thirigi Vachesariki Illantha Booju.
    ©preranabeebireddy

  • kalakruthi 7w

    #వికృత క్రీడ
    నా ప్రేమని తట్టుకునే శక్తి నీకు లేదే !
    నా చెలిమిని నిలుపుకునే కూరిమి కానరాదే !!
    నా స్నేహం గెలుచుకునే సమయం మరల నీకు రాదే !
    నా విలువలు పంచుకునే సంయమనం చూడలేదే !!
    అభిమానం వెల్లివిరిసి అనురక్తిగ మారి,
    అనురాగపు ఆ బంధం ప్రణయ గీతి పాడి,
    అంబరమున ఆశల ఉయ్యాలలే ఊగి,
    అలుపన్నది లేక ప్రేమ నిరంతరం సాగి...!
    ఆఖరకు, యదపై ఆశనిపాతమై హిమసంపాతమై, అగాధాల అంచులలో గొంతే నులిమి...! మనసే తురిమి...!
    కరుకు మాటల బండ రాళ్ళు విసిరి,
    విరసపు చేష్టల వికృత క్రీడలాడి...!
    అందలాల ఆకర్షణలు అవకాశాల ఆపేక్షలు... నీ అంతరాత్మ ఆత్మఘోషై, ఆత్మీయత పీక పిసికి హత్య చేసి... ఇది ఆత్మహత్యేనని అంటుంటే...!
    ©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    వికృత క్రీడ

    నా ప్రేమని తట్టుకునే శక్తి నీకు లేదే !
    నా చెలిమిని నిలుపుకునే కూరిమి కానరాదే !!
    నా స్నేహం గెలుచుకునే సమయం మరల నీకు రాదే !
    నా విలువలు పంచుకునే సంయమనం చూడలేదే !!
    అభిమానం వెల్లివిరిసి అనురక్తిగ మారి,
    అనురాగపు ఆ బంధం ప్రణయ గీతి పాడి,
    అంబరమున ఆశల ఉయ్యాలలే ఊగి,
    అలుపన్నది లేక ప్రేమ నిరంతరం సాగి...!
    ఆఖరకు, యదపై ఆశనిపాతమై హిమసంపాతమై, అగాధాల అంచులలో గొంతే నులిమి...! మనసే తురిమి...!
    కరుకు మాటల బండ రాళ్ళు విసిరి,
    విరసపు చేష్టల వికృత క్రీడలాడి...!
    అందలాల ఆకర్షణలు అవకాశాల ఆపేక్షలు... నీ అంతరాత్మ ఆత్మఘోషై, ఆత్మీయత పీక పిసికి హత్య చేసి... ఇది ఆత్మహత్యేనని అంటుంటే...!!! ©kalakruthi

  • rooparanibussa 7w

    సంక్రాంతి గజల్

    హేమంత మాసములో వచ్చే సంక్రాంతి
    మకరంలొ భాస్కరుడు చలించే సంక్రాంతి

    ముత్యాల ముగ్గులో గొబ్బెమ్మ స్థాపించి
    సొగసైన పూలతో రచించే సంక్రాంతి

    ససినిచ్చు భోగిలో చలికాచు సంబ్రమం
    మూలికల కట్టెలతొ జ్వలించే సంక్రాంతి

    మన్ననతొ పశువులను పంటలను పూజించి
    హరిదాసు కీర్తనతొ ధ్వనించే సంక్రాంతి

    భక్ష్యాలు వండుకొని ముచ్చటగ జతచేరి
    విందులతొ పసందుగ రుచించే సంక్రాంతి

    అందరూ సరికొత్త వస్త్రాలు ధరియించి
    అపురూప ఆటలతొ హమించే సంక్రాంతి
    ©rooparanibussa