• onamaalu 5w

  ఎన్నో ఏళ్ళ క్రితం కలిసాను ఆమెని,
  చుసిన వెంటనే కనులలోనే బంధించేసాను ఆమె రూపాన్ని,
  ఆమెని చూడని రోజు నా కనులకు అలసటే మిగులుతుంది,
  ఆమెని చుసిన మరుక్షణం నాలో ఎదో అలజడి మొదలవుతుంది.
  తనని కలిసినప్పుడల్లా మాటల్లో తడబాటు,
  తాను దూరం ఉండగా మాటల్లో చెప్పలేని ఎడబాటు,
  ఆమెని చూడగానే నా కళ్ళు ప్రసరిస్తాయని,
  ఆమె వెంట అడుగు వేయాలని కాళ్ళు పరుగులు తీస్తాయని,
  ఆమెతో మాట్లాడ్డానికి పెదవులు ప్రయత్నిస్తాయని,
  చివరకి ఆ భాష లేని నవ్వులే ఆమెని పలకరిస్తాయని,
  ఆమెతో చెప్పాలని ఉంది.
  నా తొలి ఆకర్షణ తనే
  తుదివరకు కూడా ఉండే తోడు తానే.