• anand04 6w

    శివా ..!!!
    సముద్రం
    ఒడ్డునుండి చూస్తే
    ఆకాశం సముద్రం కలిసినట్టుగా
    కనపడుతుంది ...
    కాని.....కలవదు
    అలానే....
    అంతంలేని నిరంతర
    ఆటు పోటుల జీవితంలో
    ఎన్నెన్నో ఘటనలతో సమస్యలతో
    జీవనయానం కొనసాగుతుంది.....
    కొన్నిసమయాల్లో
    సమస్యలు ..కష్టాలు ...తొలిగినట్లుగ
    మనిషి భ్రమిస్తాడు తప్ప
    శాశ్వతంగ
    సమస్యలు బాధలు కష్టాలు
    తొలగవు
    లోనజీవుడు వున్నంతకాలం
    వెన్నంటే వుంటాయి
    ©anand04