• anandrao 5w

    శివా..!!!
    హాలహలం త్రాగి లోకరక్షకుడైన
    ఓ దేవా నీలకంఠా !!
    ఈ మానవ జాతి
    నీయందు
    కృతఘ్నత మరిచి
    నిత్యం అసత్యానికి బానిసై
    ఆవేశానికి ఆహుతై
    ధనానికి పిశాచ కాపలాదారుడై
    ప్రేమబంధాలను ముక్కలు చేస్తూ
    సహనమనే ఆభూషణం లేక
    కుల్లు కుతంత్రాల, దోపిడి తో దోస్తి కట్టి
    మానవత్వము మంటగలుపుతూ
    విశ్వాసం నమ్మకం దయా కరుణ మంచి తనం
    “ మానవాళికి మనుగడకు ఆయువు”
    కాని వాటికే
    అంత్యక్రియలు తేస్తున్నాడు
    ఉన్మాదిలా
    మారి జీవితఅర్ధం మరిచి
    పాషాణంగా మారి జీవిస్తున్నాడు..
    ©anandrao