• kalakruthi 23w

    నిశ్వాశామృతఝరి

    మురిపెముగా మల్లెలపయ్ వాటముగ మోకరిల్లి 'ముకుందుడు' మంద్రముగా వేణువూద, లయబద్దముగా చిరుగజ్జల సవ్వడి చేయుచు,విరహన్వేషరసగ్న రాధ పరవశమున పులకరించి పరుగునవచ్చే...!

    పొన్న చెట్టు పంచన మొగలిపూల పొదలో పుప్పొడిరాశుల మధ్య జంట మిన్నాగులు అనంతుని 'నిశ్వాశామృతఝరిలో' ఓలలాడుచు నగ్నాతిశయమున జగములు మరచి ఆనంద తాండవమాడే...!!!
    ©kalakruthi