• vamshikrishnamedaram 22w

    నేను నల్లగా ?

    కొడుకు : అమ్మ నేను నల్లగా ఉన్నాను నాకు నచ్చలేదు....

    అమ్మ : ఎందుకురా ఎవరైనా ఏమైనా అన్నారా, అలా మాట్లాడుతున్నావు ?

    కొడుకు : ఊరికే నాకే అలా అనిపించింది అందుకే అడుగుతున్నాను...

    అమ్మ : ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో కన్నయ్య...
    నువ్వు నల్లగానే పుట్టావు...


    నీ గురించి తెలిసిన వారికి దానితో సమస్య లేదు రా... ఆ సమస్య ఉన్నవారికి నీ గురించి పరిచయం చెయ్యి చాలు...

    ప్రేమించేవారు మనం ఎలా ఉన్నా మనని స్వీకరిస్తారు రా గుర్తుపెట్టుకో కన్నయ్య...

    కొడుకు : అమ్మ నేను నల్లగా ఉన్నానా ?

    అమ్మ : కన్నయ్య...ఏమైంది రా నీకు...?

    ©vamshikrishnamedaram