• mallilokesh 6w

    _ఏమిటీ నా జీవితం అని బాధ పడేకంటే... నా జీవితానికి ఏమి తక్కువైందని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో !_

    _మనకన్నా కొన్ని వేలమంది బాగుండి వుండవచ్చు. కానీ కొన్ని కోట్లమంది కన్నా... మనం బాగున్నామన్న నిజాన్ని మరువవద్దు._

    _సంతోషాన్ని మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా వుంటుంది._

    _అర్ధమయ్యే లోపే... దూరమయ్యేది కల._
    _అర్ధం అయినా... ఒప్పుకోలేనిది వాస్తవం._
    _అర్ధం అయ్యేకొద్దీ... దగ్గరయ్యేది స్నేహం._
    _అర్ధం తెలిసీ... సరికొత్త అర్ధం వెతికేది ప్రేమ._
    _అర్ధం అయినట్టే ఉంటుంది కానీ... ఎప్పటికీ అర్ధం కానిది జీవితం !_

    _మనిషిది చాలా విచిత్రమైన స్వభావం._
    _ఇసుకలో... సౌధం చూస్తాడు._
    _రాయిలో... శిల్పం చూస్తాడు._
    _లోహంలో... ఆభరణం చూస్తాడు._
    _ఆకులో... ఔషధం చూస్తాడు._
    _అద్దంలో... అందం చూస్తాడు._
    _వ్యసనంలో... ఆనందం చూస్తాడు._
    _కానీ... సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో..!?_
    _*దివ్యమైన ఆలోచనలు*_

    _అదృష్టంతో పైకి వచ్చినవాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది._
    _అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం, దిగడం రెండు తెలిసి ఉంటుంది._
    _మొదటివాడు ఎప్పుడు పడతానోననీ భయపడుతూ ఉంటాడు. రెండోవాడు పడినా పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి, స్వయం కృషికి తేడా._
    _ఎవరూ చూడలేదని తప్పు చేయకు. అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండూ పెద్ద ముప్పు నీకు._

    _వైఫల్యానికి... కష్టాలు, ఇబ్బందులు, కారణమని సర్దిచెప్పడాన్ని చరిత్ర ఏనాడు ఒప్పుకోదు._
    _ఎప్పుడూ బాధపడుతూ ఉంటే... బతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ సమస్యలని ధైర్యంగా ఎదుర్కొంటే, జీవితమే తలవంచుతుంది._
    _మన దగ్గర ఎంత డబ్బు ఐనా ఉండవచ్చు. కానీ... ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు !_
    మల్లికార్జున్