• pranay_sagar 30w

    అమ్మ

    ఒక తల్లి తన బిడ్డకు మొదట తన గర్భములో ఆశ్రయం ఇస్తుంది. బిడ్డ పుట్టుటకు బీజము పడిన తరుణంలో ఆ బీజము బాహ్యంగా బ్రతకాలేదని తెలిసి గర్భమునందు స్థలము లేకున్నను కల్పించుకొని బీజమును రక్షిస్తుంది. ఆ బీజము బిడ్డగా మారే ప్రక్రియలో క్షణక్షణానికి పెరుగుతుంది. బాధగా ఉన్నా భారంగా ఉన్నా భాగ్యంగా తలచి తొమ్మిది నెలలపాటు సంతోషంగా మొసి తన బిడ్డ బాహ్య పరిసరాలకు అలవాటు పడగలడని తెలిసి బయటకు తెస్తుంది. తరువాత ఆ బిడ్డను స్వతంత్రముగా బ్రతుకగలిగేవరకు కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతుంది.


    బిడ్డ కోసం ఇంత చేసిన తల్లికి ఆ బిడ్డ పెద్దయిన తరువాత తన ఇంట్లో కొంత చోటును కూడా ఇవ్వలేడా?
    ©pranay_sagar