• thirulavudiya 22w

    అమ్మ అవని..

    స్వతంత్రం వచ్చి,స్వదేశం ఇచ్చి దశాబ్దాలు దాటినా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్న నాదేశం......

    రాజకీయాలు రాబందులై,రాజకీయం వ్యాపారమై   ప్రజలను రాక్షస పినుగుల్లా పీక్కుతింటున్న  వైనం......

    ఉద్యోగులు బిచ్చగాళ్ల లా  కక్కుర్తి భూత మాయలో లంచాలకంచం  లో కాసుల వేస్తే కాని పని కానీ యోచనం.......

    ఉపాధి లేక ఊరు విడిచి, కడుపు మాడ్చి, పల్లె తల్లిని విడిచి, కన్నా తల్లిని మరచి విదేశాలకు విహరిస్తున్న నా పల్లె పయణం,దిక్కు లేని విదేశాలలో  మరణం......

    నా దేశ యువత నిరుద్యోగానికి నిదర్శనం అయి,
    పుస్తకంపై ధ్యాస కరువై, నిత్యం ఫేస్బుక్కు ల్లో వాట్సప్పుల్లో,పబ్జిఇంద్రజాలమాయలో,అంతర్జాలల్లో  అంతర్లీనమైన దా నా  యువతరంగం.....

    చరవాని చెరసాలాలకుబందిగా లీనమై అనంత లోకల్లో ,విహరిస్తున్న విచక్షణ స్థితి లో ఈ నవ"తరం"గం.....

    ౨ఏ దేశం లో కానరాని వ్యవసాయ భూమి ఉన్న నా భారత అవని,ఇంకా వ్యవ"సాయం" లో వెనకబడుతూనే ఉన్న భరతుడి జనని.....

    కర్షకుడు కరువు సముద్రంలో, కష్టాల అలలలో ఆకలి కేకలలో శవమైనడా మట్టిని తినలేక, వశమైనడా మృత్యువు పై గెలవలేక.......

    వ్యవసాయి సోయి లేక సొమ్మసిల్లి నాడా ఎరువులు కొనలేక, పంట గిట్టే బాట
    లేక,గిట్టుబాటు ధర కాక అప్పుల్లో తిప్పలై  ఉరి కొమ్మలపై ఉరితాల్లతో ఊయల ఊగే దీన స్థితి లో నా దేశం......

    ౨ 'కామ'పిశాచులరాసుల్లో,రాకాసుల ముకల్లో నికృష్ట నిసిలో,దుష్ట దుర్మార్గుల
    వలలో బందీ అయిందా నా భారత మాత....

    స్త్రీ పుట్టుక శాపంగామారుతూ,పసిపాపల పసిడి మొగ్గలపై కామ కుక్కల అత్యాచారాల ఆర్తనాదంతో, కామ రక్కసి కాలకూట విష ప్రభావంతో కన్నీరు మున్నీరు అవుతుందా నా భారత మాత......

    నా దేశ అభివృద్ధి ఎప్పుడో, నా దేశ అవినీతి  శృంఖలం తెంచేదెప్పుడో,  కామ పిశాచుల తరిమేదెప్పుడో, భారతీయుడా తెలుసుకో, ఓ యువత మేలుకో........
         
                                              
    THIRU LAVUDIYA......

    .