• srinivasaravitheja 27w

    వచ్చేస్తున్నాడు మన బాసు ,
    మాసుకే గ్రేసు మన బాసు,
    కాసుకోండి ఆ క్రేజు.
    యువతరానికి గీతాంజలి అందించిన ఠాగూర్,
    సినీ మెళుకువలు నేర్పిన మాస్టర్,
    నవసమాజాన్ని నిర్మించిన ఇంద్ర,
    స్వయంకృషితో సినీవినీలాకాశంలో ధ్రువతారై నిలిచిన జగదేకవీర,
    సినీజగత్తును ఏలిన ఆపద్భాంధవ,
    ప్రజల మనస్సులను దోచుకున్న ఖైదీ,
    రికార్డులతో నాట్యమాడించిన శ్రీ మంజునాధ,
    వెండితెరపై రుద్రవీణ వాయించిన అంజి,
    పునాదిరాళ్ళతో మొదలై,చంటబ్బాయిగా కొలువై,
    జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుని,
    అందరూ బాగుండాలని అభిలషించిన జై చిరంజీవ,
    మొగుడు కావాలి అన్న సురేఖతో శుభలేఖ రాసుకుని,
    మంచుపల్లకీ పై మగమహారాజుగా వచ్చిన దేవాంతకుడైన హీరో,
    పులిపై వచ్చి రక్తసింధూరం దిద్ది విజేతగా నిలిచిన మగధీరుడు,
    కిరాతకమైన రాక్షసుడు, ధైర్యవంతుడైన దొంగ,
    రుద్రనేత్రపు భగభగలతో త్రినేత్రములను తెరచిన లంకేశ్వరుడు,
    జెంటిల్ మ్యాన్ లాంటి ముఠామేస్త్రి,
    అభిమానులకి బిగ్ బాస్ లాంటి గ్యాంగ్ లీడర్,
    ఇంతింతై వటుడింతైనట్టు ప్రజల మనసుల్లో పున్నమి నాగైన అందరివాడు,మన మెగాస్టార్, అన్నయ్య చిరంజీవి మళ్ళీ ప్రజల గుండెల్లో "ఖైదీ" అయ్యి సైరా అనుకుంటూ దూసుకొని వస్తున్న ఈ తరుణం ,మొదలెట్టండి సంబరం,ఇదవ్వాలి ప్రభంజనం తోడవ్వాలి మనమందరం.

    ఆసన్నమైంది ఆ క్షణం - "బాసాగమనం" ,చూపండి ఇక "మెగాభిమానం". 151 ఒక మైలురాయి కాని,అభిమానులకదే పండగ రేయి.

    సింహం వస్తోంది, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి.

    సై సైరా నరసింహ రెడ్డి.

    All the best Megastar Chiranjeevi, Ram Charan and team Syeraa.

    #SriWrites #BossIsBack #EmperorOfEntertainment #SriTributeToFans #Megastar #TFI #TeluguCinemaPower #Syeraa #SNR #SyeraaNarasimhaReddy #TeluguCinema