• kalakruthi 31w

  నవమాసాలు గర్భాన పిండముగ మోసి,
  పంటి బిగువున పురిటి నొప్పులు కాసి,
  రుదిరమే స్థన్యముగ మార్చి ఇచ్హి,
  మల మూత్రముల కంపు ఇంపుగా మెచ్హి,
  ఆకలి దప్పికలు నన్నెరుగనీయక,
  కష్టాలు భాదలు నను చూడనీయక,
  పారాడు పసి వయసు నుంచి ఎగిరేటి యవ్వనము దాకా తోడు నీడగ నిల్చి,
  బరువు భాద్యతల నడుమ నేర్పుగా, ఓర్పూ సహనమును చేర్చి,
  రూపు రేఖలు, మంచి చెడులు మరియు చదువు సంధ్యల తోటి అస్థిత్వవమును పెంచి,
  తండ్రి సాక్షిగ నా జన్మకు పరిపుష్టి నిచ్హి, సార్ధకత చేకూర్చినట్టి
  నా ఆత్మసాక్షీ
  నా మాతృమూర్తి
  ఓ తెలుగు తల్లీ
  నా కల్పవల్లీ
  నీకివే నీకివే నా మనహ్ పూర్వక శతానంత కోటి ధన్యవాదాలు ( ఆమ్మా నీ రుణం మేమిచ్హి తీర్చగలనమ్మా, నీ పాదపద్మముల సేవ తప్ప !) ...!!!
  Dedicated to all the mothers:
  Happy Mothers Day
  మాతృదినోత్సవ శుబాకాంక్షలు ⚘⚘⚘
  ©kalakruthi